రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాబోయే రెండేళ్ల కాలంలో 18వేల, వంద హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ లో ఆయిల్ పామ్ విస్తరణకు కేంద్ర అనుమతి ఇచ్చినందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గతంలో అవగాహన లేక ఆయిల్ పామ్ సాగుపై తెలంగాణ రైతులు దృష్టి పెట్టలేదని మంత్రి అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. కేంద్రం నుంచి వచ్చిన అధ్యయన కమిటీ.. రాష్ట్రంలో రెండు సార్లు పర్యటన చేసి ఆయిల్ పామ్ సాగుకు అనుమతి ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ఆయిల్ పామ్ సాగులో ఎకరానికి ఏడాదికి 1లక్ష 20వేల నుంచి 1లక్ష 50వేల వరకు ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ పంటను ప్రభుత్వమే కొంటుందనే గ్యారంటీ ఉందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో విరివిగా ఆయిల్ పామ్ సాగు: మంత్రి నిరంజన్ రెడ్డి