సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని అగ్ర కథానాయకుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన చిరంజీవి.. సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ భారతి కూడా అక్కడే ఉన్నారు. తాను కథానాయకుడిగా నటించిన 'సైరా:నరసింహారెడ్డి' చిత్రాన్ని వీక్షించాల్సిందిగా జగన్‌ను కోరారు. అనంతరం ఇరువురు కలిసి భోజనం చేశారు. చిరు ఇటీవల తెలంగాణ గవర్నర్‌ తమిళసైను కూడా కలిసి 'సైరా' చూడాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.